బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? భయపడకండి – పూర్తి పరిష్కారం ఇక్కడ తెలుసుకోండి
ఇటీవల చాలా మంది చెప్పే ఒకే ఒక మాట
“నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది… ఏం చేయాలి?”
సోషల్ మీడియాలో, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర ఈ సమస్య ఎక్కువగా వినిపిస్తోంది. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయితే రోజువారీ జీవితమే ఆగిపోతుంది. UPI పనిచేయదు, ATM నుండి డబ్బు రావడం లేదు, సాలరీ వచ్చినా తీసుకోలేని పరిస్థితి వస్తుంది. అందుకే ఈ సమస్యపై స్పష్టమైన అవగాహన చాలా అవసరం.
ఈ ఆర్టికల్ చదివితే బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది, ఎలా అన్‌ఫ్రీజ్ చేయాలి, పోలీస్ కేస్ పడుతుందా లేదా అనే అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది.
బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది?
ప్రస్తుతం బ్యాంకులు ప్రధానంగా మూడు కారణాల వల్ల అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి.
మొదటి కారణం – ఇల్లీగల్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బు
గాంబ్లింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, కొన్ని ఫాస్ట్ లోన్ యాప్స్ ద్వారా అకౌంట్‌లోకి డబ్బు వస్తే బ్యాంక్ దాన్ని అనుమానాస్పదంగా తీసుకుని అకౌంట్‌ను ఫ్రీజ్ చేస్తుంది.
రెండో కారణం – అన్యమైన లావాదేవీలు
తెలియని వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు 50,000 రూపాయలకంటే ఎక్కువ) డబ్బు అకౌంట్‌లోకి వచ్చినప్పుడు బ్యాంక్ సస్పిషన్‌తో అకౌంట్‌ను ఫ్రీజ్ చేయవచ్చు.
మూడో కారణం – సైబర్ కంప్లైంట్
ఎవరైనా మీ అకౌంట్‌కు సంబంధించిన లావాదేవీలపై సైబర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తే, బ్యాంక్‌కు అలర్ట్ వస్తుంది. దాంతో అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది.
బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయితే ఏ సమస్యలు వస్తాయి?
- అకౌంట్ ఫ్రీజ్ అయిన తర్వాత
- UPI ట్రాన్సాక్షన్స్ పనిచేయవు
- ATM ద్వారా డబ్బు తీసుకోలేరు
- నెట్ బ్యాంకింగ్ బ్లాక్ అవుతుంది
- సాలరీ వచ్చినా విత్‌డ్రా చేయలేరు
- అకౌంట్‌లో డబ్బు ఉన్నా ఉపయోగించలేని పరిస్థితి వస్తుంది
ఇలాంటి సమయంలో భయపడకుండా వెంటనే సరైన చర్యలు తీసుకోవాలి.
అకౌంట్ ఫ్రీజ్ అయితే పోలీస్ కేస్ పడుతుందా?
చాలా మందికి వచ్చే పెద్ద భయం ఇదే.
నిజం చెప్పాలంటే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినంత మాత్రాన వెంటనే కేస్ పడదు.
కానీ సైబర్ టీమ్‌కు డౌట్ ఉంటే విచారణ చేయవచ్చు. పోలీస్ నుంచి కాల్ రావచ్చు లేదా స్టేషన్‌కు పిలిచి వివరణ అడగవచ్చు. మీరు చేసిన లావాదేవీలు చట్టబద్ధమైనవైతే భయపడాల్సిన అవసరం లేదు.
బ్యాంక్ అకౌంట్ అన్‌ఫ్రీజ్ ఎలా చేయాలి?
స్టెప్ 1
ముందుగా మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి బ్రాంచ్ ఆఫీసర్‌ను కలవాలి. అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయిందో క్లియర్‌గా అడగాలి.
స్టెప్ 2
సైబర్ కంప్లైంట్ వల్ల ఫ్రీజ్ అయితే, కంప్లైంట్ నెంబర్, FIR డీటెయిల్స్, కంప్లైంట్ చేసిన స్టేట్ వివరాలు బ్యాంక్ నుంచి తీసుకోండి.
స్టెప్ 3
ఆ కంప్లైంట్ ఏ స్టేట్‌లో ఫైల్ అయిందో తెలుసుకుని, మీ దగ్గరలోని సైబర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి.
స్టెప్ 4
మీరు ఇన్నోసెంట్ అని ప్రూఫ్ చూపించాలి.
ఉదాహరణకు గేమింగ్ యాప్ ద్వారా డబ్బు వస్తే – గేమింగ్ ఐడి, విన్ అయిన వివరాలు, ట్రాన్సాక్షన్ ప్రూఫ్ చూపించాలి.
స్టెప్ 5
సైబర్ ఆఫీసర్ విచారణ తర్వాత నో అబ్జెక్షన్ లెటర్ లేదా మెమో ఇస్తారు. దాన్ని బ్యాంక్‌కు ఇవ్వాలి.
ఆ తర్వాత బ్యాంక్ హెడ్ ఆఫీస్‌కు రిపోర్ట్ పంపుతుంది. సాధారణంగా 7 నుంచి 15 రోజుల్లో అకౌంట్ అన్‌ఫ్రీజ్ అవుతుంది.
భవిష్యత్తులో అకౌంట్ ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే
ఫాస్ట్ మనీ ఇచ్చే యాప్స్‌ను దూరంగా పెట్టండి
తెలియని QR కోడ్స్‌ను స్కాన్ చేయకండి
పెద్ద మొత్తంలో డబ్బు రిసీవ్ చేసినప్పుడు సోర్స్ ప్రూఫ్ ఉంచుకోండి
ఎప్పుడూ లీగల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయండి
.jpg)
