తెలంగాణ రాష్ట్ర లేబర్ కార్డ్ అప్లై విధానం! లేబర్ కార్డ్ ప్రయోజనాలు..!



కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్లకు గుడ్ న్యూస్. చాలామంది లేబర్ కార్డు అప్లై చేయాలని అనుకుంటారు కానీ చాలామంది చేసుకోరు. లేబర్ కార్డు అప్లికేషన్ చేయాలంటే మీ దగ్గర రేషన్ కార్డు కంపల్సరీ. ఎందుకంటే రీసెంట్‌గా చాలా మందికి కొత్త రేషన్ కార్డు వచ్చింది.

లేబర్ కార్డు ఉంటే లాభాలు ఏంటి? అప్లై చేయడానికి ఈశ్రాం కార్డు తప్పనిసరిగా ఉండాలా? లేకుండా అప్లై చేయవచ్చా? లేబర్ కార్డు బెనిఫిట్స్ ఏంటి? రేషన్ కార్డు లో క్యాండిడేట్ ఉండాలా లేకపోయినా అప్లై చేయవచ్చా?

లేబర్ కార్డు అప్లికేషన్ చేసేందుకు అవసరమైనవి:

  • రేషన్ కార్డు
  • అందులో ఉన్న సభ్యుల ఆధార్ జిరాక్సులు
  • లేబర్ కార్డు ఎవరిపై తీసుకోవాలనుకుంటున్నారో వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు
  • 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

లేబర్ కార్డు బెనిఫిట్స్:

  • కూతురు పెళ్లి చేస్తే ₹30,000
  • డెలివరీ అయినా ₹30,000
  • ప్రమాద మరణం అయితే ₹6 లక్షలు
  • సహజ మరణం అయితే ₹30,000

ఒక్కసారి ఫీజు చెల్లిస్తే 5 సంవత్సరాల పాటు మరేం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంత మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.

ఎవరైనా దీన్ని సంవత్సరాలుగా అప్లై చేయాలి అనుకుంటూ వదిలేస్తుంటారు. దగ్గర్లోని లేబర్ ఆఫీస్ లేదా మీ సేవలో అప్లై చేయండి.

ఇప్పటికే అప్లై చేసిన వారు, రేషన్ కార్డు మార్చిన వారు ఆన్లైన్‌లో అప్డేట్ చేసుకోవాలి.