తెలంగాణ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. స్వయం ఉపాధి లక్ష్యంగా ఉచిత కుట్టు మెషిన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న మహిళలు ఉచితంగా కుట్టు మెషిన్ పొందవచ్చు. ముఖ్యంగా టైలరింగ్ ద్వారా ఆదాయం పొందాలనుకునే మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పథకానికి ఎవరు అప్లై చేయవచ్చు, ఏ డాక్యుమెంట్స్ అవసరం, వయస్సు ఎంత ఉండాలి, అప్లికేషన్ ఎలా చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఉచిత కుట్టు మెషిన్ పథకానికి అర్హతలు
ఈ పథకం తెలంగాణ రాష్ట్ర మహిళల కోసం మాత్రమే. అప్లై చేసే వారు మహిళలే కావాలి. గ్రామీణ ప్రాంతాల మహిళలైతే వార్షిక ఆదాయం రూ.1,50,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల మహిళలైతే వార్షిక ఆదాయం రూ.2,50,000 లోపు ఉండాలి.
మతం మరియు కుల పరంగా చూస్తే ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైన్స్‌కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇతర కులాలకు ఈ పథకం అందుబాటులో లేదు.
టైలరింగ్‌లో శిక్షణ పొందినవారికి ప్రాధాన్యత ఉంటుంది. సర్టిఫికెట్ ఉంటే అప్లోడ్ చేయవచ్చు, లేకపోయినా అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
మొబైల్ నెంబర్
ఇన్‌కమ్ సర్టిఫికెట్ (ఉంటే)
టైలరింగ్ సర్టిఫికెట్ (ఉంటే)
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (50KB నుంచి 1MB మధ్య)
స్టార్ మార్క్ ఉన్న వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.
ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మొదట గూగుల్ ఓపెన్ చేసి TS OBMMS అని టైప్ చేయాలి. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత “Apply Online for Availing the Sewing Machine” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అయిన తర్వాత ఆధార్ కార్డు ప్రకారం పేరు నమోదు చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే రేషన్ కార్డు వివరాలు ఆటోమేటిక్‌గా వస్తాయి.
రూరల్ లేదా అర్బన్ ఎంపిక చేయాలి. తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు నమోదు చేయాలి. ఇన్‌కమ్ సర్టిఫికెట్ నెంబర్ ఉంటే ఇవ్వాలి.
డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు ప్రకారం ఇవ్వాలి. వార్షిక ఆదాయం వివరాలు నమోదు చేయాలి. మ్యారేజ్ స్టేటస్ సెలెక్ట్ చేయాలి.
మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అవసరమైతే అదనపు నెంబర్ కూడా ఇవ్వవచ్చు. మతం, కులం వివరాలు సెలెక్ట్ చేయాలి.
టైలరింగ్ శిక్షణ ఎక్కడ నేర్చుకున్నారో ఎంపిక చేయాలి. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, మండల్ లేదా మున్సిపాలిటీ, పంచాయతీ వివరాలు నమోదు చేయాలి.
పిన్ కోడ్, డోర్ నెంబర్, పూర్తి చిరునామా ఆధార్ ప్రకారం నమోదు చేయాలి.
అప్లికెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి. టైలరింగ్ సర్టిఫికెట్ ఉంటే అప్లోడ్ చేయాలి.
చివరగా సెల్ఫ్ డిక్లరేషన్‌కు టిక్ మార్క్ చేసి ప్రివ్యూ చూసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత ప్రింట్ తీసుకోవచ్చు.
చివరి తేదీ
ఈ ఉచిత కుట్టు మెషిన్ పథకానికి అప్లై చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 31. అర్హత ఉన్న మహిళలు చివరి తేదీకి ముందు తప్పకుండా అప్లై చేసుకోవాలి.
telangana free sewing machine scheme
free sewing machine for women in telangana
.jpg)
